ఉషోదయం
ఉషోదయం
ఉషోదయపు కిరణాలు తనువును తాకగా
నవోదయపు ఆశలు మదిలో చిగురించగా
వాటికోసం ఈ రోజు ప్రయత్నం ఆరంభించు
క్షణాలు గడిచే కొద్దీ ఎండ వేధిస్తున్నా
కష్టాలు గుండెను బాధిస్తున్నా
మొదలెట్టిన పనిని కొనసాగించు
సమస్యలు మన మెదడును చుట్టుముట్టినా
చిగురించిన ఆశలన్నీ ఆవిరవుతున్నా
గెలుపు కోసమే శ్రమించు
నిన్నటి తప్పులను సరిదిద్దుకుంటూ
రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ
చేరే గమ్యానికి బాటలు పరుచు