తులసి
తులసి
తులసీ నిను పూజిస్తే..ఛాదస్తం అన్నారే..!
ఇప్పుడు నువు కనిపిస్తే..కోసి టీలొ వేస్తారే..!
తులసికోట ఇంటిముందు..తులసివనం పెరటిలోన..
పెంచలేని మానవులే..గగనాలను దాటారే..!
అయోమయపు మాలోకం..అజ్ఞానపు మత్తులోన..
దివ్యౌషధ మూలమీవు..తెలిసికూడ మరిచారే..!
తల్లులకు తల్లి నీవు..భూమాత ప్రియపుత్రికా..
నీ రసమే సేవించక..నీరసముగ మిగిలారే..!
ప్రాణవాయు ప్రచోదితా..నిత్యసత్య ప్రకాశితా..
నీ చరితను నీ శక్తిని..తక్కువగా తలచారే..!
ఉచ్ఛ్వాస నిశ్వాసలే..అసలుతులసి దళాలుగా..
చూడలేని ఈనరులే..నిన్ను హింస పెడతారే..!