STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

తల్లీ భారతీ!

తల్లీ భారతీ!

1 min
1.1K

తల్లీ భారతీ!


ఆ దేవుని దృష్టియందు ఈ సృష్టి అంతయూ

ఉందో లేదో కానీ

మానవుని సృష్టిలో ఆ దైవమున్నదనుటకు

నిదర్శనమే..మతం

తెలివిలేని వాటిని బానిస చేసుకొనే అలవాటున్న మనిషి

పాపమనే భూతాన్ని చూపి భయపెట్టి

అధికులు అధములను అనుచరులుగా

మార్చుకొనేదే... మతమంటే నమ్మక తప్పదు


ఓ మనిషీ! పరమతమంటు వేరు చేస్తున్నది.. మతాన్నే అనుకుంటే అది నీ మూర్ఖత్వమే

మతమంటే..మనిషి

సాటి మనిషిని మనిషిగకాక మతంగ చూడటం 

మద్యం మత్తును మించిన మత్తు


ఒకరికి జిలేబి ఇష్టం మరొకరికి కాజా ఇష్టం

పదార్థాల పేర్లు వేరైనా...

వాటి లక్షణం ఒక్కటే..తీయదనం

మతాల వేర్లు వేరైనా పంచేఫలాలు ఒక్కటే..మంచితనం అదే నా భరత వనం


ఏడురంగులున్న అందం..హరివిల్లు

అనేక మతాలు కలిసున్న అద్బుతం..

మన భరత మాత ఇల్లు

అనేక ప్రాంతాలనుండి వచ్చే నదులన్నీ 

కడలిలో కలిసినట్లు

భారతావని..ఎక్కడనుండో వచ్చిన భిన్న మతస్థులందరికీ పుట్టినిల్లు


తల్లీ భారతీ...

నీ ఒడిలో నాకు మాకు చోటిచ్చినందుకు

అందుకో మా నమస్సులు హారతి!


      .....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Action