తెలంగాణ
తెలంగాణ


నా మదిలో మెరిసిన తెలంగాణ - నా తెలంగాణ
ఐదువేల ఏళ్ళ చరిత్ర గలదే నా తెలంగాణ ...
తేహజిబ్ రాజధానే నా తెలంగాణ..
ముషాయిరాల గానాలే నా తెలంగాణ...
బతుకమ్మల చిత్రమాలికే నా తెలంగాణ...
బోనాల ఊరేగింపులు శివసత్తుల గజ్జెల సవ్వడులు అమ్మొరుల భవిష్యవాణిలే నా తెలంగాణ ....
రామప్ప,అలంపుర్ల శిల్పసంపదే నా తెలంగాణ..
బిర్యాని బువ్వల గుమగుమలే నా తెలంగాణ..
డబుల్కామీటాల గుమగుమలు...
కట్టామీటాల దోస్తనే నా తెలంగాణ...
పోయత్తనే అవ్వ అంటే ఇంకో రెండు దినాలు ఉండి పోరాదే అనే అవ్వల తేనె పలుకే నా తెలంగాణ...
గంగమ్మ పరవళ్ళు తొక్కే కాళేశ్వరమే నా తెలంగాణ...
పంట చేతికి అందిన రైతన్నల చిరునవ్వే నా తెలంగాణ....