STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

స్వచ్ఛజలములు

స్వచ్ఛజలములు

1 min
4

స్వచ్ఛజలములు.


నదుల యందు ముఱికి నష్టంబు ధరణికి

కంపుగొట్టు జలము గరళమగును

స్వచ్ఛమైన నీరు జనులకు ప్రాణము

తెలిసి కొనుము నీవు తెలివి కలిగి.//


చెత్తనంత తెచ్చి చెరువులందునవేయు

బుద్ధిమానుకొనుచు శుద్ధి చేయ

త్రాగునీరు కొఱకు తంటాలు తప్పును

మనసు పెట్టి వినుమ!మంచి మాట//


జలము కొఱకు మనిషి జాగ్రత్త పడకున్న

భవిత లేక తుదకు భయము మిగులు

నీటి కఱవు మనల నిలువున ముంచును

పెద్దవారి మాట వినుము బాల!//


నీటి బొట్టు కొఱకు నిత్యంబు వగచుచు

మైళ్ళ కొలది నడచి మనుజులిపుడు

క్రుంగి పోవుచుంద్రు కూలగన్ బ్రతుకులు

భావి మిగలకుండ భస్మ మగును //



ధనపు రాశి నీదు దాహంబు తీర్చునా?

ప్రాణ మిచ్చు జలము వసుధయందు

కానరాకయున్న కలిమి నీ కెందుకు?

కడుపు నింపవోయి కాసులెపుడు!//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational