STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

స్వాతంత్య్రం..

స్వాతంత్య్రం..

1 min
374

స్వాతంత్ర్యం...


స్వయం పాలనీ

స్వయం పోషినీ

స్వయం ప్రకాశనీ

స్వర్ణ ధారినీ అయిన భరత మాతని


స్వార్థపరులైన శ్వేత జాతీయులు

స్వార్థంతో

భారతీయుల స్వార్జితమైన

సిరి సంపదలను

స్వాధిపత్యంతో స్వాధీన పరచుకుని

స్వాహా చేస్తుంటే


స్వదేశం కోసం

స్వగృహాలు వదిలి

స్వతహాగ

స్వతస్సిద్ధంగా


స్వకార్యమని

స్వాంతంబున ప్రతిన బూని

స్వాభావికమైన 

స్వాభిమనాన్ని స్వదత్తం చేసి


స్వజనులెందరో

స్వజం చిందించి

స్వబీజాన్ని స్వయం త్యజించి

మనకందించిన..

స్వాదు ఫలాలే..


ఈ స్వాతంత్య్రం

స్వతంత్రం

స్వేచ్ఛ


స్వేచ్ఛ పొందినమ్మన్న సంతోషం విడిచి

మితి మీరిన స్వేచ్ఛాయుతలమై

మనవారి స్వేచ్ఛనే స్వకంపనంలో కలిపి

స్వాధికారం మరచి

స్వాధీనం మొదలుపెట్టి


సర్వంబు నాశనమ్ము దిశగా

స్వారీ చేస్తూ

స్వార్ధపరమైన

స్వీయానందాన్ని పొందుతున్న

ఓ స్వేచ్ఛా భారతీయుడా


స్వేచ్ఛకు కూడా ఉండాలి హద్దు

అది మానవత్వమ్ముతోనే సాధించవచ్చు

ఆ రోజే..సమానత్వమ్ము వచ్చు


        .......రాజ్.......



Rate this content
Log in

Similar telugu poem from Tragedy