STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

స్వాతంత్ర్యం

స్వాతంత్ర్యం

1 min
366

కావేరీ -- గోదావరీ -- గంగా -- యమునా

అందమైన హిమగిరుల భరతదేశమదిగో

భరతమాత ముద్దుబిడ్డల చిరనివాసమదిగో

గిరిసిరులతొ అలరారే నీలగిరులు అవిగో

గలగలగల సెలయేరుల గానరవళులవిగో

గాంధీజీ నేర్పిన అహింసా వాదము

నెహ్రూజీ నడచిన శాంతి మార్గము

నేతాజీ కనసరచిన క్రోధావేశము

వీరులిచ్చిన రక్త తర్పణము

వీర వనితల యుద్ధ కౌశలము

ధీర మాతల త్యాగఫలము

నేటి మన స్వేచ్ఛకు కారణము

ఈ స్వాతంత్ర్యమును మనము

ఊపిరున్నంత వరకు కాపాడుదాము

సమానతా -- మానవతా -- సమతా -- కర్తవ్యం


Rate this content
Log in

Similar telugu poem from Inspirational