STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

సుమబాల విహారము- వచన కవితా సౌరభం kaweeshwar

సుమబాల విహారము- వచన కవితా సౌరభం kaweeshwar

1 min
278

23.09.2021

అంశం: వచన కవితా సౌరభం

శీర్షిక: సుమబాల విహారము

*** కవీశ్వర్ 

కుసుమ కోమల లాలిత్య సౌరభ ఆకృతి 

నందన వన వికసిత దేవ పారిజాత స్మృతి

ఈ కుసుమమ్మునే నారదుని చే కృష్ణర్పిత 

సత్యా - రుక్మిణి కలహ కారణంబే ఇలన్ ఇంతి 


శ్రీ మాతా చారు కేశినల్ల కలువల తూడులత

నయన చకోరమ్ముల అరవింద దళయుత నేత్రి

గంధమాదన సానువుల్లో విహరించిన సౌగంధికా కుసుమ లత

వ్యాహాళికే ఆఘ్రాణ యుక్త శీతల చందన సహితం


గొబ్బెమ్మలలో ఇమిడిన సంక్రాంతి లక్ష్మి కొప్పులోని సుమమాల 

బతుకమ్మలసిబ్బి పై అమరిన వివిధ సుమబాలల విలాసం 

గుచ్ఛములలో అభినందనల సన్నజాజి పువ్వుల చిరు నవ్వుల మోముతో

పూల రథాలపై, జాతర్ల అలంకరణల సుమబాలల చిరయశస్సు మనందరితో


ఉద్యాన వనాల మొక్కల పై వికసించే పూబాలలు మలయా మారుత ముఖ డోలమ్

చలిత లలిత సుందర చుంబిత కుసుమరాజముల ప్రియ సీమ శృంగారం

చర్చిత , అర్చిత , అర్పిత పరిపరి విధముల ఉపయోగిత బాల మన సులలితం

మూన్నాళ్ళ ఆయువుచే సొగసు , హొయల నయనానంద కరముచే సంపూజిత కూజితం .


Rate this content
Log in

Similar telugu poem from Action