సప్తరంగుల హోలీ
సప్తరంగుల హోలీ
సప్తరంగులతో హోలీ పండుగ ఆడెను మన మురళీధర ముకుందం,
మంత్రముగ్ధ రాధిక మానసంలో నింపెను ప్రణయరంగుల వలయం,
బృందావనం నందు ఆనంద వర్ణం చూపంచెను గోపకాంతల నర్తనం,
హర్షిత గోకులవాసులకు అతి అమూల్యం ఈ ప్రియదర్శన ప్రదర్శనం |౧|
అర్చకులు ఉపాసకులు పులకించి పరవశించెను మోసి శ్రీడోలగోవిందుని విమానం,
శ్రీదేవి భూదేవిలతో మధుసూదనుని డోలోత్సవం గ్రామానికి చేసెను శోభాయమానం,
దోలమంటపం దోలవేదిక పైన దేవదేవుని ఫాల్గుణ ఉత్సవం ఒ అనన్య సందర్శనం,
చాచేరి వేషం సువర్ణ వేషంతో అయ్యెను శంఖక్షేత్రము శ్రీజగన్నాథుని దివ్యదర్శనం |౨|
ఫాల్గుణపౌర్ణమి పర్వదినం అత్యంత కమనీయం రమణీయం,
తిరునాళ్లతో ఊరు ఊరు తిరువీధులకు లభించెను అలంకారం,
ఆలకించవలెను తిలకించవలెను జనుల సంతోషం సమాహారం,
భారతీయుల వద్ద చిరంగా ఉండెను ఈ సతతహరిత సంప్రదాయం |౩|
