సంభవం
సంభవం


ధైర్యం, సాహసం నీదిరా
ఉడుము పట్టు పట్టారా, నీ ఉనికిని చాటరా
ఆదర్శం మెండుగా, కళ్ళలో నిండేరా
విక్రమార్క ధైర్యము, కల్కి యొక్క రోషము //
జ్ఞానమే విజ్ఞ్యామై
భావమే నిండుగా పలుకరా ధీటుగా
గరళానికి గాంభీర్యం
గమ్యానికి గౌరవం //
ఉనికిలేని జీవితం
ఉత్తరుని ప్రతాపం
ఉషోదయని కాంతిలో
మెరుగుసాన పట్టారా //
సంభవం కానిది లేదురా జగత్తులో
సంస్కారం నిండుగా, జీవనం చేయరా
ప్రపంచమే నీదిరా, పయనించు ప్రకాశంగా
ప్రాణంగా నిలువరా, పరులసేవ చేయరా //
ఆడింది ఆటగా, పాడింది పాటగా
జీవితం చూడరా, సంబరం చేయరా //
కనీళ్ళని తుడవరా, బాధలను మరవరా
అండగా నిలవరా, ఆదర్శంగా బతకరా
బతుకు జీవితాన్ని, బాగుపరచు నిండుగా
కలకాలం నిలవరా, నూరేళ్ళ పంటగా //