STORYMIRROR

Gayatri Tokachichu

Children

4  

Gayatri Tokachichu

Children

సమసమాజ స్థాపన

సమసమాజ స్థాపన

1 min
222

*సమసమాజ స్థాపన*

(బాలగేయం )


అంబేద్కరు మహాశయుని

ఆశయాల నందుకోండి!

సర్వోన్నత భారతిగా

సంఘమించి దిద్దిరండి!


మూఢత్వపు పోకడల

ముప్పును గ్రహియించండి!

సంఘములోని మలినాలను

సమూలముగా తొలగించండి!


విద్యావేత్తలై దేశానికి

వెన్నెముకగా నిలవండి!

విజయులై కీర్తి పతాకమును

వినువీధిలో నెగరేయండి!


కులమత భేదాలను

కూల్చివేసి కదలండి!

బలయుతులై మన జాతికి బాసటగా నడవండి!


సమసమాజ స్థాపనకు

జనులంతా కలిసిరండి!

నవ చైతన్యపు లోకానికి

నాయకులై వెలగండి! //


*********************



Rate this content
Log in

Similar telugu poem from Children