STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Children

4  

Dinakar Reddy

Abstract Children Stories Children

నిద్దరకొచ్చిన బిడ్డ

నిద్దరకొచ్చిన బిడ్డ

1 min
319

లేగదూడ ఆకలికి ఆవు అంబా అని పిలిచినట్టు

గూటిలోని గువ్వ పిల్లకు తల్లి పక్షి తినిపించినట్టు

నా ఆకలి నీకు తెలియలేదా అమ్మా

కాసింత బువ్వ పెట్టమని అడిగానమ్మా


యశోదమ్మ కృష్ణుడిని బుజ్జగించినట్లు

బెజ్జ మహాదేవి శివుడిని లాలించినట్లు

నాకు జోల పాట పాడమ్మా

నిద్దరకొచ్చిన బిడ్డకు జోల పాడతారు కదా


అమ్మా

ఏమ్మా పలకవూ

దేముడి దగ్గరే ఉంటావని చెప్పారే

మరి పలకవు ఎందుకమ్మా

దేముడు మాట్లాడొద్దని చెప్పాడా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract