STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

4.3  

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

జలం..నీ బలం

జలం..నీ బలం

1 min
313


 (జల దినోత్సవం సందర్భంగా)


జలం..జలం

నీ బలం అచంచలం


సాగరాలు..జీవనదులు

ఏర్లు...సెల ఏర్లూ

కొలనులు . చెరువులు

కాలువలు..బావులు

వర్షపు ఝల్లులు..

అన్నీ...అన్నీ...

ఇలా.. ఎన్నెన్నో..నీ దళాలు

వాటిని లెక్కింప గలవా ప్రమధగణాలు


మానవుని...తనువులో

రక్తం కన్నా అధికముగా ఉన్న ఓ జలమా

నీవు మాకిచ్చే . సంపద..చెప్పగలమా

జలమా...నీ శక్తి అద్భుతం

నీ గుణం అద్వితీయం

నీ లక్షణం.... ఔషధం


నీటితో..

చాటు మాటునున్న 

ఘాటు రోగాలన్నీ..మటుమాయం

కన్నీటితో..

వేదనలో..బాధలో..బరువెక్కిన

గుండెలన్నీ..ఒక్కసారిగా తేలికమయం


ప్రతి హృది లోనూ..నెమ్ముంది

ప్రతి మదిలోనూ... చెమ్మఉంది 

బండరాయి లోనూ.. తేమఉంది

ఈ భూమిపై..నీవు తాకనినదంటూ ఏముంది?


తలచుకుంటే.. సాధించనది ఏముంది

అని..

సెలయేటి.. అనునిత్య ప్రవాహమ్ముతో

బండరాయిని సైతం గీటు పెట్టగల నీ 

అకుంఠిత దీక్ష చెబుతోంది


ఓ..దైవ సమాన..జలం

నీవు తెరుచావో... గళం

మేమంతా..అవుతాం

అడ్రస్ లేని వాళ్ళం


అందుకే...అందరం తాగుదాం..జలం

పాడుదాం రోగాలకు..మంగళం🙏🙏


       .....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Classics