STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

4  

Thorlapati Raju(రాజ్)

Classics Inspirational Children

గణితం..

గణితం..

1 min
375

(డిసెంబర్ -22)

గణితమా! నువ్వు లేనిదెక్కడ?


తల్లి గర్భం నుండి..

బయటకొచ్చే కాల వ్యవధిలో ఉన్నావు!

పాల బుగ్గల పాపాయి..

పాల దంతాల సంఖ్యలో ఉన్నావు!

కూర్చునే కుర్చీ..

పడుకొనే మంచాల ఆకారాల్లో..ఉన్నావ్


పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించే..

సరూప పటాలలో ఉన్నావు!

కొండ ఎత్తులు సముద్రపు లోతులు..

తెలిపే సూత్రాలలో ఉన్నావు!


జీవ శాస్త్రంలో ఉన్నావు..

జంతు శాస్త్రం లో ఉన్నావు..

ఖగోళంలో ఉన్నావు..

కపాలం లో ఉన్నావు!

కనుపాపను తాకే...

ప్రతి ఆకృతి లో ఉన్నావు!


గుండె గాబరని గుర్తించే..

గ్రాఫ్ లలో ఉన్నావు!

మా చరిత్రను తెలిపే..

శతాబ్ధాలలో ఉన్నావు!


ఓ గణితమా!

అంతరిక్షాన్ని అందుకోవాలన్న..

ఆశకు సూత్రం...నీవు!

అంతరంగాన్ని కొలవాలన్న..

కోరికకు సూచికవు...నీవు!


అంగుళమైనా వేయని

అంగడి వస్తువులకు...

అందమైన ఆకృతినిచ్చిన..

జ్యామితీయ శిల్పివి...నీవు!


ఆంగ్ల అక్షరాలను..

అందలమెక్కించిన..

బీజీయ బిలేనియర్ వి.. నీవు!


పగలు రాత్రులను..

పక్షపాతం లేకుండా పంచిన

గడియారం..నీవు!

ఈ నాటి.. 

కరోనా కళేబరాలకు..

కౌంటింగ్ మిషన్ వి... నీవు!


మా జీవితానికి...

వయసునిచ్చిన కాలమానం..నీవు!

చివరికి మాకు మిగిలేది..

ఆరడుగులే అన్న అంతర్యామివి..నీవు!


అందుకే ఓ గణితమా!

నీవు..

అన్నింటినీ అనుసంధానం చేసే..

సంధాన కర్త!

జీవితానికి ఖచ్చితత్వాన్ని నేర్పే..

మహా ప్రవక్త!


     .......18..1..10....

         R A J



Rate this content
Log in

Similar telugu poem from Classics