STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Children

4  

Dinakar Reddy

Abstract Drama Children

ఎంతెంత దూరం

ఎంతెంత దూరం

1 min
352

అదిగో తను మొదటిసారి నిలబడింది

అయ్యో పడిపోతుంది పట్టుకోండి

అతడిలో ఆదుర్దా


అదిగో తను మొదటిసారి అమ్మ అంది

అవునా నాన్నా అని అనలేదా

అతనిలో సహజమైన ఆత్రుత


అదిగో తను మొదటిసారి అన్నం తింటోంది

అవునా 

అతనిలో ఆశ్చర్యం


అదిగో తను మొదటిసారి పాట పాడింది

ఏ పాట

పిల్లలు పాడే ఆరున్నొక్క రాగంలో

అదే ఏడుపు చూసి

అతని కళ్ళల్లో నీళ్ళు


అదిగో తను మొదటిసారి ఎబిసిడి వ్రాసింది

అవునా 

అతడి కళ్ళలో ఏదో గర్వం


అదిగో తను మొదటిసారి స్కూలుకు వెళుతోంది

అవునా

అతడిలో పెరిగిన బాధ్యత


అమ్మా !

నాన్న ఎంత దూరంలో ఉన్నాడు?

అదే ప్రశ్న

ఒక్క వీడియో కాల్ అంత దూరం

అంతే దూరం 

అదే సమాధానం

ఎంతెంత దూరం అంటే

సెలవు పెట్టలేని దూరం

అది మధ్యతరగతి ఉద్యోగి జీవితంలోని భారం

అని ఆ తండ్రి చెప్పలేడు పాపం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract