STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

నాన్న ప్రేమ

నాన్న ప్రేమ

1 min
306

కని పెంచే ప్రేమ అమ్మదైతే

కనిపించని ప్రేమ నాన్నది..

కంటిపాపలా కాచుకునేది అమ్మయితే

కంటిపాపే తానై దారి చూపేది నాన్న..

పిల్లల భవిష్యత్తుకై పరితపిస్తూ

ఒంట్లో సత్తువింకే వరకు పోరాడే సైనికుడు..

కుటుంబ కీర్తికై శ్రమిస్తూ

శ్రమనెరుగక శ్రమించే నిత్య శ్రామికుడు..

అవరోదాలను అవలీలగా అధిగమిస్తూ

విజయబాట నడిపించే మార్గదర్శుడు..

కుటుంబంకోసం అహర్నిషలు కృషి చేస్తూ

స్వార్థమెరుగని నిస్వార్థపరుడు..

సర్వం తానై సమస్తం నడిపించే

ఏకైక శక్తి యుక్తి నాన్నప్రేమ

ఎప్పటికీ అమరం అజరామరం..



Rate this content
Log in

Similar telugu poem from Inspirational