STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

నాన్న

నాన్న

1 min
327

పురుడు పోసుకున్న అమ్మను ముద్దాడి

కూతురిగా నన్ను చేతిలో తీసుకున్నపుడు

నీ కంటి చెమ్మలో ఎనలేని ప్రేమ దాగుందని

నాకప్పుడు తెలీలేదు..


భుజాలమీద నన్ను మోసినపుడు

నా బాధ్యతనంతా నీ భుజస్కందాలపై మోస్తున్నావని నాకప్పుడు తెలీలేదు..


నా వేలు పట్టి నడక నేర్పినపుడు

నా భవితకు బాటలు పరుస్తున్నావని

నాకప్పుడు తెలీలేదు..


ఒళ్ళో కూర్చోబెట్టి కథలు చెబుతున్నపుడు

ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నావని 

నాకప్పుడు తెలీలేదు..


బాగోగులు చూస్తూ బాధలను భరిస్తూ

భవిష్యత్తుకై పరితపిస్తూ సత్తువనంతా ధారబోస్తున్నావని నాకప్పుడు తెలీలేదు...


అహర్నిషలు కుటుంబం కోసమే కృషి చేస్తూ

మా సంతోషమే ఆశయంగా సాగుతున్నప్పుడు

నీ ఆశల సౌధం మేమేనని నాకప్పుడు తెలీలేదు..


కష్టాల కడలిని కాననీయక నవ్వులపూలు పూయించినపుడు నీ చెమట చుక్కల శ్రమ దాగుందని నాకప్పుడు తెలీలేదు..


ఎన్నో..ఎన్నెన్నో...మాకై చేసి

ఏమీ ఎరగక ఎక్కడో వెనకాల నిలబడినపుడు

మా సుఖసంతోషాలు విజయపరంపరలు నీవేనని

నాకప్పుడు తెలీలేదు..


నాన్నా..!మా బ్రతుకు పుస్తకం నిండా నీవేనని

మా జీవన సౌరభమంతా నీవే వున్నావని

ఇప్పుడు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది..


ఇంకా ఎందుకు నాన్న అజ్ఞాతం నీకు?

ఈ బరువును భరింపలేమిక

ఈ ప్రేమను మోయలేమింకా

నీ కఠోర శ్రమకు సాక్ష్యంగా నిలిచిన

మేము నీకు సేవలు చేసుకుని

తరించే భాగ్యాన్ని కల్పించవూ..


విజేతగా వెలుగులోకి వచ్చి

విశ్వవ్యాప్తం విస్తరించిన నీ ప్రేమను

వెలుగై నిలచిననీ త్యాగాన్ని

కీర్తించనీ నలు దిశలకుు..


Rate this content
Log in

Similar telugu poem from Inspirational