STORYMIRROR

శ్రీకాంత్ బెందాళం

Classics Inspirational Children

4  

శ్రీకాంత్ బెందాళం

Classics Inspirational Children

అమ్మ

అమ్మ

1 min
350

కడుపు మాడుతున్నా

బిడ్డల కడుపును

పస్తుంచనిది

అమ్మా..!

తాళిని సైతం కుదువ పెట్టి

ప్రాణాలను పణంగా పెట్టి

కష్టాలలో ఆదుకునేది

అమ్మా..!


కష్టాల కొలిమిలో 

వేదన చెందిన హృదయాన్ని

వెన్ను తట్టి వీపునిమిరి

ధైర్యంతో ముందుకు నడిపేది

అమ్మా...!

సంసారపు జడివానలో

తడిసి ముద్దాయినా

ఊరట కోసం

చీర కొంగును

గొడుగులా పట్టి

పెను బాధల చలిలో వణకినా

బిడ్డల కోసం

ఆశల కుంపటి వెలిగించేది అమ్మా..!


శ్రీ..✍


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics