STORYMIRROR

శ్రీకాంత్ బెందాళం

Romance Tragedy Inspirational

3  

శ్రీకాంత్ బెందాళం

Romance Tragedy Inspirational

What I'm 🚶

What I'm 🚶

1 min
208

#WHAT#IAM

నేనేంటి?!

ఒక వారసత్వ వాంఛ కు

పుట్టిన సెక్స్ విత్తనాన్నా

నేనేంటి?!

ఒక ఒంటరి విప్లవం లో మిగిలిన 

వీరత్వం లోని వీర్య కణాన్నా?

నేనేంటి?!

చరిత్ర తాలూకు ఆనవాళ్ళ కోసం

పుట్టిన చిట్టచివరి ఉనికినా?

నేనేంటి?!

కలల గర్భం లో పురుడుపోసుకుంటున్న

ఒక తరం తాలూకు మార్గదర్శినా?

నేనేంటి?!

ఒక నవీన మానవుని పాశవిక స్వార్థం లో

జనించిన మెదడు లేని మేధస్సునా?

నేనేంటి?!

యుగాల బానిసత్వ మనుగడలో మరిచిన

ఒక అర చేతి బిగువలో దాగున్న జాతి గుండె నిబ్బరాన్నా?

నేనేంటి?!

తన అందం తాలూకు మత్తులో 

ఒక ప్రేమ ఉషస్సు కోసం దగ్ధమౌతున్న వ్యసనపరున్నా?!

నేనేంటి?!

నిజంగా నేననేది 

సంపూర్ణమా?

భౌతికమా?

నిగూఢమైన అంతరంగాన్నా?

లోతైన అంతర్మధనాన్నా?


Rate this content
Log in

Similar telugu poem from Romance