కాలం నన్ను వెంటాడుతూనే ఉంది
కాలం నన్ను వెంటాడుతూనే ఉంది
కాలం కాలం నన్ను వెంటాడుతూ ఉంది
నడిరేయిలో నన్ను ఒంటరిని చేస్తుంది
కాలం కాలం నన్ను వెంటాడుతూ ఉంది
నడిరేయిలో నన్ను ఒంటరిని చేస్తుంది
ఈ క్షణం నా చేతిలో ఉన్నట్టుంది
మరుక్షణం ఆ చెయ్యి జారి నట్టుంది
ఏ క్షణాన ఏమవుతుందో తెలియని
జీవితం లా మారింది
నేను ఒకటి తలుస్తుంటే
విధి వేరొకటి తలుస్తుంది
ఏమిటో తెలియని విచిత్ర జీవితం
అది వచ్చింది కాదు అంటుంది
లేని దాని కోసం పాకులాడుతుంది
ఏదో చెయాలి అని తాపత్రయా పడుతున్నా
విధి ఆడే వింతైన ఆటలో పావుగా వాడుకుంటుంది
అనుకుంది సాధించాను అనుకునే లోపు
నీవు చేరుకోవలసినది సాధించ వలసింది
ఇంకా ఉంది అంటుంది
వేచి చూస్తున్న నేను మెచ్చే కాలం
వస్తుంది ఏమో అని
కాలం కాలం నన్ను వెంటాడుతూ ఉంది
నడిరేయిలో నన్ను ఒంటరిని చేస్తుంది
కాలం కాలం నన్ను వెంటాడుతూ ఉంది
నడిరేయిలో నన్ను ఒంటరిని చేస్తుంది
శ్రీ...✍️