అందుకే..😥
అందుకే..😥
అన్నదాతల ఆత్మహత్యలను ఆపలేని
నా అక్షరాలకు
ఆవార్డులు ఎందుకు
పడతులపై కామపు కోరలతో బుసకొట్టే పాములను చంపలేని
నా పదాలకు పొగడ్తలు ఎందుకు
పస్తులతో సహవాసం చేస్తూ గొడు వెళ్ళబోసుకుంటున్న గుడిసెకు కూడుపెట్టని
నా వాక్యాలకు
సత్కారాలు ఎందుకు
అందుకే
ఎవరైనా నన్ను కవి అంటే
సిగ్గుతో తలదించుకుంటుంది
నా మనసు
అంత పెద్ద మాటను మోయలేనని
దిగులుచెందుతూ
శ్రీ..✍
