STORYMIRROR

శ్రీకాంత్ బెందాళం

Drama Classics

3  

శ్రీకాంత్ బెందాళం

Drama Classics

జీవితం.. రంగస్థలం

జీవితం.. రంగస్థలం

1 min
236

బంధాలన్నీ బూటకమే

మనుషులంతా నటనే

బ్రతుకంతా నాటకమే

జీవితం రంగస్థలమే..


ఎందుకోసం ఈ ఆరాటం

దేనికోసం ఈ పోరాటం

తెలియని ప్రయాణం

చేరలేని గమ్యం..


ప్రతిక్షణం ఆందోళనే

అనుక్షణం ఆవేదనే

అర్ధంకాని పరిచయాలు

అర్థంలేని అపార్ధాలు..


అరక్షణం ఆవేశం

మరుక్షణం ఆరాధన

పదే పదే క్షమాపణలు

పరిపరి విధాల తిరస్కారాలు..


ఏంటో జీవితం

అర్ధమైనట్టు ఉంటుంది

అర్ధం కానట్టు అనిపిస్తుంది

అర్ధమయ్యేలోపు ముగుస్తుంది..


బంధాల నడుమ మనసులు

బంధీ అయిన జీవితాలు

బరువు,బాధ్యతల నడుమ

ప్రతి గడియ యుద్ధమే..


శ్రీ..✍️


Rate this content
Log in

Similar telugu poem from Drama