స్మృతులకు దూరమౌతూ
స్మృతులకు దూరమౌతూ


స్మృతులకు దూరంగా
......................,..,,.
శవాల్ని సమాధి చేస్తే
అది ఎప్పుడైనా కనిపిస్తే
గతానుభవానుభూతులు
మమతానురాగాలు గురుతుకువస్తే
అణగారిపోయిన
మనసుమొలకెత్తి
మనుషినై పోతానేమోనని
భయం....
అందుకే
ఏ గురుతులనూ మిగిల్చని
సామూహిక విద్యుత్ శ్మశానాలవైపు
వెళుతున్నాను
గాదిరాజు మధుసూదనరాజు