సినిమా సిత్రం
సినిమా సిత్రం
నలుపు తెలుపు చిత్రాల నుంచి
మధురమైన పాటలు ఎన్నో
గేవా కలర్ లోని చిత్రాల మాటలు
ఈస్ట్ మన్ కలర్ చిత్రాల డాన్సులు
ఓ మంచి ఫీలింగ్ కలిగినా
బాధ కలిగినా
హృదయం బరువు అనిపించినా
ఎంతో మంది గుర్తు తెచ్చుకునేది సినిమా
అందాల ఆరబోతలు అంటూ వార్తలు
కలిసి ఉన్నారనే కబుర్లు
సినిమా నటుల వివరాలతో మ్యాగజైన్లు ఎన్నో
బ్రతుకుతెరువుగా కొందరు
అదే బ్రతుకని చెప్పే కొందరు
తెరపైన నటించే బ్రతుకే గొప్ప బ్రతుకనే ఎందరో
రంగుల వెనుక లోకాన్ని గ్రహించగలరా
వారాంతపు వినోదంగా
బిజీ జీవితం నుంచి ఆటవిడుపుగా
కుటుంబపు సమిష్టి అలవాటుగా
మన మాటల్లో
మన భావాల్లో
సినిమా పాతుకుపోయింది
వాదాలెన్ని ఉన్నా
విమర్శలు గుప్పుమన్నా
తన పంథాను పంతంగా
ప్రేక్షకుల మనసులను గెలుస్తూ
ముందుకు వెళ్లే సినిమాలు ఎన్నో
మనలో అంతర్భాగం అయిన సినిమాకు వందనం
