STORYMIRROR

ARJUNAIAH NARRA

Inspirational

4  

ARJUNAIAH NARRA

Inspirational

శ్రీ వాహిణి

శ్రీ వాహిణి

1 min
357

శ్రీ వాహిణి

పచ్చని పొలాల మధ్య

నిండుగా కొలువై పల్లెలని

పల్లెపిల్లలను ప్రగతి పథంలో

ప్రయాణించేలా తీర్చిదిద్దే

జ్ఞానదీపం.......


శ్రీ వాహిణి

జ్ఞాన ప్రదాయిని

తిరువురి ఒడిలో

తిమిర సంహారిణి

మధ్యతరగతి బతుకుల్లో

మరుపురాని మలుపురాయి.....


శ్రీ వాహిణి 

బతుకు సమరంలో

యువకిశోరాల మనసులో

మరువలేని చిరునామా......


శ్రీ వాహిణి 

తన వడి వాకిటలో

విరబూసిన సిరిమల్లెలను

ప్రపంచ నలుమూలలను

పరిమళ భరితం చేసిన

అఖండ జ్ఞాన ప్రదాయిని.........


శ్రీ వాహిణి

ప్రేమల పొదరిల్లు

మమతల హరివిల్లు

అనురాగాల చిరుజల్లు

**** **** *****

తిరువూరు నుండి

తిరుగు ప్రయాణం

మధురమైన జ్ఞాపకాలను

మదిలో నింపుకొని

బరువైన గుండెతో

బాటసారి బయలుదేరేను...... 

మరో బతుకు సమరానికి...

************************

దూరం నుండి సమీరం లీలగా సంగీతాన్ని

మోసుకొచ్చింది....

ఓ బాటసారి ఇది జీవిత రహదారి

ఓ బాటసారి ఇది జీవిత రహదారి

ఎంత దూరమో ఏది అంతమో

ఎవరూ ఎరుగని దారి ఇది

ఒకరికి సొంతము కాదు ఇది

ఓ బాటసారి ఇది జీవిత రహదారి

**** **** ****


Rate this content
Log in

Similar telugu poem from Inspirational