STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

శ్రీ రామ నవమి

శ్రీ రామ నవమి

1 min
274

లోక సంరక్షణార్థం అవనిపై జనించి

సీతాన్వేషణకై రాక్షస సంహారం కావించి

పితృవాక్య పరిపాలకుడిగా పేరొంది

సోదర బంధానికి ప్రతీకగా నిలచి

ఆలుమగల అనురాగానికి చిహ్నమై

అంజనీ సుతుని ఆరాధ్య దైవమై

రామదాసుని కటాక్షించి

భద్రగిరిపై సీతాసమేతుడై

భక్తజనులకు పావనమూర్తియై

లోకాభిరాముడిగా మన్ననలొందెను

పరమప్రీతి పాత్రుడిగా ఇలలో నిలిచెను

లోకానికే ఆదర్శమాయెను ఆయన దివ్యచరితం

నవమినాడు శ్రీరాముని కల్యాణం

కనులారా గాంచిన వారి జన్మ ధన్యం

శ్రీరామనామం సర్వపుణ్యధామం

తరతరాలకు చెరగని సంకేతం



Rate this content
Log in

Similar telugu poem from Abstract