STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

శీర్షిక : "మా" తోడు-నీడ , రక్షణ :కవితా సౌరభం : కవీశ్వర్ : 07 . 03 2022

శీర్షిక : "మా" తోడు-నీడ , రక్షణ :కవితా సౌరభం : కవీశ్వర్ : 07 . 03 2022

1 min
1.3K

అంతర్జాతీయ మహిళా దినోత్సవ (08 . 03 . 2022 ) సందర్భంగా 

ఈ వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 07 . 03 2022 .

శీర్షిక : "మా" తోడు-నీడ , రక్షణ 

ప్రకృతిని సృజించినట్టి జగన్మాత తోడు-నీడగా త్రిమూర్తులన్ నిల వ్యక్తము చేయగాన్ 

బ్రహ్మాణ్డ జ్ఞానమునుహరివితరణ చేయఁ తన తోడుగా మహాలక్ష్మినిహృదయ రాణిగాను

సృజనకర్తయగు బ్రహ్మ తన జీవనసహధర్మ చారిణిగావాగ్దేవిని విద్యా లక్ష్మిగాచేసుకునెన్ 

లయ కారకుని రూపంబుగా తన అర్ధ శరీరంబు పార్వతికి నొసంగి అర్ధనారీశ్వరుండయ్యెన్ 


పుట్టినప్పుడే తన తల్లినే మాతృమూర్తిగాకారుణ్యము ,మమతను,లాలననుపాలననొసంగెన్ 

కిశోరప్రాయంబునన్ సోదరినొసంగి అండగా ,కలసిమెలిసి ఆనందముగా జీవితాన్నీగడపగన్

ప్రౌఢ వయస్సునందు సఖురాలిని సహకర్మచారిణిగా నెంచుకుని రక్షణగా ఇలన్ ప్రవర్థితుడు 

పరిణయ ప్రాయంబునం సహ ధర్మచారిణి ధర్మపత్నిని జీవితాన్ని పుత్ర - పుత్రికలతో వర్ధిల్లన్


వంశవృక్షంబు ఓరిమితో,రక్షించి,నిర్మించి తనదైనముద్ర అభివృద్ధి లో కలయగలుపు ముదితవే

దేశనిర్మాణంలో,సకలరంగాల్లో సహకార,సహయోగ,స్వానుభవ ఫలితాలనిచ్చే సుందర లలనవే  

విశ్వంలో నీయొక్క క్రియా - ప్రతిక్రియలనామోదించి , ఉన్నత స్థానం లో నిలిపి కొనసాగింపజేసి 

సకల అన్యాయ, అక్రమ , దుష్కర్మల, దుశ్చర్యల బారినుండి సదా తరుణులన్ రక్షించుకోవలెన్ 

 

వ్యాఖ్య : "08 .03 .2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విశ్వంలోని మహిళలందరికీ ఈ వచనకవితా సౌరభం " అంకితం - కవీశ్వర్ తరపున అందరికీ శుభా కాంక్షలు . హృదయ పూర్వక శుభా భినందనలు .

 


Rate this content
Log in

Similar telugu poem from Action