Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Inspirational

సాగిపో...

సాగిపో...

1 min
341


"ఓ అపరిపూర్ణ ఆజ్ఞాత ఆశాజీవి!!"


ప్రేగు తెంచి, కన్ను తెరచి, గుక్క పెట్టి, గంతులేసింది మొదలు 

నూలు కప్పి, చాపచుట్టి, కర్ర కట్టి, కట్టేపై కాల్చే వరకూ 

సాగే జీవిత ప్రయాణమే తాత్కాలికమైనప్పుడు ఆ తాత్కాలికపు ప్రయాణంలో ఎదురయ్యే


సంతోషం - కోపం, 

ప్రేమ - ద్వేషం,

సాయం - మోసం,

బాధ - బాధ్యత, 

ఇష్టం - కష్టం,

అందం - బంధం లాంటి అలంకారాలన్నీ తాత్కాలికమేకదోయి.


యదలోని భావాలు ఆశగా నింగికే నిచ్చెన వేసినా..

ఎగిసిపడకోయి,

మదిలోని ఆలోచనలు బరువుతో పుడమికే పరిమితం చేసినా.. కృంగిపోకోయి,

సవాలు లాంటి ప్రతి ఒడిదుడుకు ఒక అనుభవమే కదోయి,

ఆ అనుభవాలు నేర్పిన పాఠాలే పరిపూర్ణ జీవితానికి 

అభివృద్ధి సోపానాలుగా మలుచుకోవోయి, 


ధృడంగా నిలబడవోయి,

         ముందుకు సాగిపోవోయి..

              పట్టుదలతో ఛేదించవోయి...

     

                 సత్య పవన్



Rate this content
Log in

Similar telugu poem from Inspirational