STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సాధారణ జీవనం

సాధారణ జీవనం

1 min
313

జలుబొస్తే సెలవులు

దగ్గితే దూరాలు

మాస్కుకే కబుర్లు

మరచిపోని పల్స్ ఆక్సీమీటర్ రీడింగులు


వ్యాక్సిన్ గురించిన సందేహాలు

ఆసుపత్రుల బయట జన సందోహాలు

కరోనా నిర్ధారణ పరీక్షల ఉద్వేగాలు

క్వారంటైన్ లాక్ డౌన్ సందేహాలు

ఆన్లైన్ లో చదువులు


ఆగిన నిర్మాణాలు

మూసిన హోటళ్ళు, థియేటర్లు

భారంగా నడుపుతున్న ఆఫీసులు

సంపాదన కోల్పోయిన కూలీలు


విపరీతమైన నిరుద్యోగం

విలయ తాండవంలా వ్యాధుల దుమారం

చావుకు దగ్గరైన వారు

చివరి చూపులు వద్దనుకున్న వారు


ఇంత ఘోర విపత్తులో

మానవత్వం ఉనికిని నిలబెట్టిన

డాక్టర్లు,పారిశుధ్య కార్మికులు, రక్షక సిబ్బంది

ఎందరో సాయం చేస్తూ

మరెందరో సాయాన్ని కోరుకుంటూ


అస్తవ్యస్తమైన జీవనాన్ని

అతి సాధారణమని నమ్ముతూ

అడుగు గడప దాటనీయకుండా..



Rate this content
Log in

Similar telugu poem from Abstract