STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Inspirational

4  

ARJUNAIAH NARRA

Abstract Inspirational

రమబాయి అంబెడ్కర్

రమబాయి అంబెడ్కర్

1 min
366


స్త్రీల గురించి చర్చలన్న

ఇల్లాలు గురించి వినాలన్న

మమత అనురాగాల మాటన్న

సంస్కృతి నిర్వచనాలకే నిదర్శనం  

భారతమాత ముద్దు బిడ్డల్లో

కోట్ల స్త్రీలకు ఆదర్శప్రాయం

అంబెడ్కర్ సతీమణి రమభాయి.....


పేదరికం బాధలు 

నిలువునా మండిస్తున్నా

కుటుంబ భారాన్ని మోస్తూ

కన్నీటి కష్టాలను ఇడూస్తూ

కడుపున పుట్టిన బిడ్డలను

కాటికి మోస్తూ పూలు రాలి

మోడైన మొక్కల విలపిస్తూన్న

విషాద గీతం రమభాయి జీవితం


విదేశాల్లో చదువుతున్న భర్త 

ఆశయ లక్ష్యాలను గౌరవిస్తూ

జీవన గమనంలో రహదారిగా మారి

కంటికి రెప్పలా అంబేద్కర్‌ని కాపాడి 

ప్రపంచ మేధావిగా తీర్చిదిద్ది

భారతజాతికి ఓ మహోన్నత నాయకుని

అందించిన సాత్వికురాలు రమభాయి....


కస్తూర్బా గాంధీ పతిభిక్ష పెట్టమని

కొంగు చాపి కోరగా

జాతిపిత నిరాహారదీక్షను 

విరమింప జేయమని 

తన పతిని వేడుకొని గాంధీకి

ప్రాణ భిక్షను ప్రసాదించేలా చేసిన

నీ కరుణ తరంగాలకు

దేశమందు దళిత మాతగా

వెలుగునొందిన ధన్యజీవి రమబాయి!


నీ హృదయ సౌశీల్యం, నీ సహనం,

నీ మనో నిబ్బరం, నీ బలిదానం,

నీ త్యాగ నిరతికి ప్రతీకలు

నీ మరణం లేదా నీ వియోగం అంబెడ్కర్ కి

పాకిస్థాన్ లేదా భారత్ విభజన రెండును 

రెండు కళ్లనుండి ప్రవహించే కన్నీటి జీవనదులుగా

భారత దేశ చరిత్ర పుటల్లో చిరస్మరణీయం !



Rate this content
Log in

Similar telugu poem from Abstract