రెచ్చిపోకు
రెచ్చిపోకు
రెచ్చిపోకు
-------------------
పట్టుసడలింది
కట్టుతొలగింది
స్వేచ్ఛవచ్చింది
ఓహోయంటూ
హెచ్చినఆనందంతో
రెచ్చిపోకు విచ్చలవిడిగా
తిరుగబోకు పిచ్చిపిచ్చిగా
మాటలకైనా
ఆటలకైనా
అడ్డూఅదుపులుండాలి
ఆహారపు అలవాట్లలోనైనా
ఆచ్ఛాదనల ధారణలోనైనా
ఉండాలి మేలైన దిద్దుబాట్లు
ఆచారాల ఆచరణల్లోనైనా
ఆరోగ్యాల పరిరక్షణకైయైనా
ఉండాలి తగినన్ని సర్దుబాట్లు
వినోదవిహారాలవిందులందైనా
ఆనందమైనా అనుభూతికైనా
రక్షణకై వృద్ధికై సంపూర్ణక్షేమం కై
ఉండాలి తగినన్ని కట్టుబాట్లు!
కట్టుబాట్లలోను తగిన వెసులుబాట్లు!!