STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

రాలుతున్న ఆకులు

రాలుతున్న ఆకులు

1 min
440

పళ్ళు లేని నోళ్ళు

ఊత కర్ర సాయంతో అడుగు వేసే కాళ్ళు


అద్దాల చాటున నిర్లిప్తంగా కళ్ళు

ఒడలిపోయిన ఒళ్లు


గుదిగుచ్చిన అనుభవాలు

కాలం మాన్పింది అనుకునే గాయాలు


కట్టెల మోపులు ఖాళీ పల్లెలు

కట్టె లాంటి మనుషులు

వంగిపోయిన నడుములు


ఎక్కడి నుంచో ఫోను

చిన్నవ్వ పోయింది

పెద్దమ్మ ఇంక లేదు

తాతయ్యకు కాలం తీరింది


శిశిరం చప్పుడు కాకుండా ఆకులు రాలుస్తోంది

రాలిన పండుటాకులు కాటికి చేరుతున్న దేహాలు


పెళ్లికో చావుకో అన్నట్టు కలిసిన వాళ్ళు

ఆ పల్లెకేదో సందడి తెచ్చారు


ఎక్కడో వసంతం వస్తుందన్నట్లు

ప్రకృతి ఒళ్లు విరుచుకుంది

రాలిన ఆకులు దూరంగా ఎగిరిపోయాయి.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract