రాధాకృష్ణులు ప్రేమ
రాధాకృష్ణులు ప్రేమ
రాధ శ్వాస కృష్ణుడులే,
కృష్ణుని జీవం రాధేలే,
రాధా కృష్ణులు ఒకరి ప్రాణం ఒకరులే.
రాధా పెదవులపై కదలాడే పలుకే కృష్ణుడులే,
కృష్ణుని హృది ప్రియమానసి రాధేలే,
రాధాకృష్ణుల ప్రతిఊహ ప్రేమామృతమేలే,
ప్రణయవీణ పలికేటి ప్రతిరాగం
రాధాకృష్ణుల తీపి వలపేలే.
బృందావనపు ప్రేమలోగిలి వున్నదే
రాధాకృష్ణుల ప్రేమకోసమేలే,
వియోగమెరుగని ప్రేమే
తీపి తలపుల మధురగీతిగా సదా మది మురిపించులే,
అలసిపోని ఆరాధనే
అమృతానుబంధం అయ్యిందిలే,
యుగాలు మారినా
మాసిపోని
ప్రేమజీవన మధురిమ మహిమ తెలపతరం కాదులే,
రాధలోని కృష్ణుడు
కృష్ణుని లోని రాధాప్రేమే శాశ్వతానంద నిధిలే,
సుధలు పంచేటి ప్రేమవేల్పులకు నిత్య
మమతల హారతి యివ్వాలిలే.
