పుడమి పిలుపు విను వర్షమా
పుడమి పిలుపు విను వర్షమా
అమృత వర్షిణిలా రావే ఓ వర్షమా
నా తనువు తడపగ స్వాతి చినుకులు ఇవ్వుమా
కాగితపు పడవలన్నీ నీకోసం నిరీక్షిస్తున్నాయమ్మా
కాసేపైనా పడవలతో ముచ్చటించగ రావమ్మా
నీ నేస్తం రైతన్న నీకై పరితపిస్తున్నాడమ్మ
నా నేస్తం నీవంటూ నింగి దిగి రావా మిత్రమా
"అమృత"
యదలో మూగిన ఊసుల సుడుల ఊయలలున్నాయి
యద బీటలుబార్చు సంగతులు నాలో ఉన్నాయి
అశ్రువులు అలసిపోక పరుగులిడుతున్నాయి
నాకళ్ళలో నీవు కరిగి కన్నీటిని గుట్టుగ దాచగ రావమ్మా
ఈ పుడమికి ఉన్న నేస్తం నీవని తలస్తున్నాను
నీ రాకకై కనులుమూయక చకోర పక్షినయ్యానమ్మా
"అమృత"
సప్త వర్ణముల మధుర స్మృతులు నీకున్నాయి
సప్త రాగాలపిస్తూ ప్రకృతికి కూచిపూడి కులుకులు నేర్పుతాయ
ఏ వర్ణపు కాంతి లేక నా చరణములు చిందులు మరిచాయి
నీ కాంతితో నన్ను పలకరించి రంజింప చేయగ రావమ్మా
నీవు లేక నీటి ధారలు మూగపోయి ఉన్నాయి
నే మురళీతో జీవంపోసి వంశధారాలుగ మలచగ రావమ్మా
