STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పరుగెత్తకుంటే..

పరుగెత్తకుంటే..

1 min
4

ఇలా ఉండకూడదు

అందరి కంటే నువ్వే బాగుండాలి

బాగా ఆడాలి

బాగా పరుగెత్తాలి

బాగా చదువుకోవాలి

గొప్ప ఉద్యోగాలు చెయ్యాలి

పక్కింటి వాళ్ళ కంటే గొప్పగా బతకాలి


ఎవ్వరూ చెయ్యలేని పనులన్నీ చేసేయాలి

ఎప్పుడూ బిజీగా ఉన్నట్లు కనిపించాలి

అలా లేకుంటే 

మనకు విలువ ఇవ్వరనే అభిప్రాయం

నీకు నువ్వు అబద్ధం చెప్పుకునేటప్పుడు

ఇంకొకరు విలువ ఇస్తున్నారా లేదా ఎందుకు


కాస్త నీ బుద్ధిని అడుగు

నువ్వెంతలా మారిపోయావో

బాధను అలవాటుగా మార్చుకుని

నిన్ను నువ్వు ఏమార్చుకుంటే సరిపోతుందా

నీ సమస్యల్ని పరిష్కరించుకో

సరదాగా కాసేపు నవ్వుకో

ప్రపంచ యుద్ధాలన్నీ నువ్వే ఆపటం లేదు


వాళ్లేదో చెప్పారని

వీళ్లేదో అన్నారని

ఇంకొకరేదో అనుకుంటారని

నీ ప్రవర్తనతో నువ్వే 

సొంత ఇంట్లో యుద్ధం తెచ్చుకుంటున్నావ్

మరీ ఎక్కువ గొడవొద్దు 

మాటలతో కాలం వృథా చేయొద్దు

లక్ష్యం వైపు నీ పయనం

కావాలి వెలుగుకు ఆగమనం



Rate this content
Log in

Similar telugu poem from Abstract