ప్రియా ఎప్పుడు ఒస్తావు!
ప్రియా ఎప్పుడు ఒస్తావు!

1 min

387
ఎంత ఆపినా అగనంటోంది నా మనసు
మౌనంగా నీ వెంటే ఒస్తానంటోంది
నా మనసును కాస్త నీ మనసుతో జతచేసి బంధించు ప్రియా..
ఏ పువ్వును చూసినా
నీ చిరునవ్వులానే కనిపిస్తుంది..
ఏ చెట్టు కొమ్మ గాలికి ఊగిన
నువు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది..
ఏంటో ఈ మాయ...
నీ జ్ఞాపకాలు వెంటాడుతుంటే..
నీ మాటలను ఏ గాలిలో వెతకాలి..
నీ రూపాన్ని చూపించమని
ఏ మేఘాన్ని అడగాలి..
నీ తోడు లేక ఒంటరి అయిన మనసుకు
నీ రాకతో మళ్ళీ వసంతాన్ని ఎప్పుడు తెస్తావు ..
నువు లేక ఊపిరి ఆగిపోయిన నా కలానికి మళ్ళీ ప్రాణం ఎప్పుడు పోస్తావు..
శ్రీ...
హృదయ స్పందన.
.