STORYMIRROR

Dinakar Reddy

Action Thriller

4  

Dinakar Reddy

Action Thriller

పరిమాణ క్రమంలో..

పరిమాణ క్రమంలో..

1 min
210

పరుగెడుతూ ఉన్నా

పని మారలేదు

పరిణామ క్రమంలో

పరిధి పెరగలేదు


పాకుతూ చెట్లను పట్టుకుని

దూకుతూ రాళ్ళను ఆపుకుని

సైగలు కొత్తగా నేర్చి

భాషను అక్షరాలతో సమకూర్చి


లిపిని ఆధునీకరించి

కుడ్య చిత్రాల నుంచి

కుహనా మేధావి తర్కముల వరకూ

పరిణామ క్రమంలో

ఎన్నో వింతలు

మరెన్నో మార్పులు


వాటికి లోను కాకుండా

స్వయం ప్రతపత్తితో మెలగాలని

ఇంకా ప్రయత్నించే జీవులం

నువ్వూ నేనూ


Rate this content
Log in

Similar telugu poem from Action