పల్లెకు పోదాము!
పల్లెకు పోదాము!
పల్లెకు పోదాము!
(ఇష్టపదులు )
జనమధికమై పోవ శైలములు కూల్చేసి
వనములను కాల్చేసి భవనాలు కట్టేసి
నగరాలు నిర్మించ నలుసంత చోటేది?
పగలు రేయనక పడు బాధలకు సెలవేది?
వాన కురిసిన చాలు వరదలో మునుగంగ
ప్రాణములు కడబట్టి ప్రజలు భయమొందంగ
నీటి కష్టాలతో నిత్య సంఘర్షణము
కాటు వేయ జబ్బులు కలత చెందెడి జనము
నగర జీవనంబు నరకప్రాయంబాయె
దిగులొందిన ప్రజకు దిక్కు తోచక పోయె
చెట్టు చేమను పెంచి చింతలను తొలగించ
కట్టుబాట్లతో ప్రజ కలిమితో జీవించ
పల్లె జీవన మిపుడు బంగారు స్వప్నమై
చల్లంగ నీ బ్రతుకు సాగులే దివ్యమై
పోదాము పల్లెలకు భోగాలు కలవోయి!
రాదోయి కష్టంబు రాజువై మనవోయి!//
