STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

పిడికిలి

పిడికిలి

1 min
196

నరనరాన పాతుకుపోయిన

మనుసంస్కృతి వారసులు వీళ్ళు..

అణువణువు జీర్ణించుకుపోయిన

ఆధిపత్య అహంబావ కర్కోటకులు వీళ్ళు..

అంగాంగాన కామక్రోధ రసాలతో

మరుగుతున్న మానవ మృగాలు వీళ్ళు..

వంచించాలనేవారు,వాంచించాలనేవారే తప్ప వావివరసలు ఆలోచించరు వీళ్ళు..

పుట్టుకొచ్చిన ఇలాంటి కొత్త వింత జాతి

నీ జోలికొస్తే....

పిడికిలి నే పంజాగా మార్చు..

పదునైన చేతిగోళ్ళనే

పిడిబాకులా ప్రయోగించు..

వాడియైన పండ్లను సైతం

బలమైన వాడి కండను కోసే

కొడవలిగా మలుచు..

సృష్టి కే ప్రతిసృష్టి చేయగల

చేవనంతా ప్రోది చేసి

దేహదాహంకై మీదికి వచ్చే

మృగ మగాడి మీద సంధించు..

శీలాన్ని జుర్రుకోవాలనే

వాడి ఆలోచనకే వణుకు పుట్టే లా

నీ శరీరంలోని ప్రతి అవయవాన్ని

ఒక్కొక్క ఆయుధంగా మలచు..

సమాజాన మొలిచిన అవలక్షణ అంకురాలను తుంచి

నీ రుధిరాశ్రువులతో చెడును చెరిపెయ్..

ఏ బోధనలు నీ బాధను తీర్చవు..

ఏ నీతులు నీ మంటను చల్లార్చవు..

నీకు నీవే తోడుగా నీకు నీవే రక్షగా

నీ చరిత్రను నీవే పునర్లిఖించు..


Rate this content
Log in

Similar telugu poem from Fantasy