ఓ నా ప్రియ విద్యార్థీ- కవితా
ఓ నా ప్రియ విద్యార్థీ- కవితా
జన్మించిన తర్వాత మాతా పితరులు గురువులుగా ;
తదుపరి పాఠ శాలలో ఉపాధ్యాయులే ఒజ్జలుగా ;
నీవే నిపుణత కల్గిన భావి భారత పౌరునిగా ,
మార్గ దర్శిగా మారే ఓ ప్రియా విద్యార్థీ ......
పెద్దలు నుడివిన మాటలే మీకు సూచనలుగా ;
వాటిని అనుసరించీ , అనుకరించే బాలలుగా ;
సహజ నైపుణ్యమును ప్రదర్శించే పిడుగులుగా ;
మీదైనా శైలి లో లక్ష్యాన్ని చేరే ఓ ప్రియా విద్యార్థీ .....
కవనంలో కవులుగా, రణరంగములో ధీరో దాత్తులుగా ;
కార్య సాధనం లో కార్యదర్శులుగా , నాట్యంలో నాట్య మయూరులుగా ;
గానం లో గాన కోకిలలుగా , వృత్తి ప్రవృత్తులలో నిష్ణాతులుగా ;
పేరు ప్రఖ్యాతులను పొందే చిరు దీపికా ఓ ప్రియ విద్యార్థీ ......
చిర కాలం నీ తలంపులలో , తల్లిదండ్రుల పిదప
కలకాలం గురువులే గుర్తుకు వచ్చి ఉభయుల హితం తో ,
కార్య సాధనలో మార్గ దర్శులు గా , నిత్యం మీ వెన్నంటి ప్రోత్సహించే ,
వారిని గుర్తుంచుకో , మార్గదర్శనం లో చిరకీర్తిని నిలుపుకో ,ఓ ప్రియా విద్యార్థీ ......
-- కవీశ్వర్