ఓ గ్రామం
ఓ గ్రామం
చలిని మరిచేలా
తొడుక్కున్న కోట్లు
దాచిన స్కేటింగ్ బోర్డ్లు
నవ్వుతున్న ముఖాలు
ఎర్రబడ్డ చెక్కిళ్ళు
ఆటలు
పాటలు
నృత్యాలు
జోకర్లు
అన్నిటితో మురిసే పిల్లలు
ఆకులు రాలిన చెట్లు
మంచు బిందువులను మోస్తూ
అటూ ఇటూ నడిచే వాళ్ళ
టోపీల మీద దూకుతూ
చలిని గుర్తు చేయాలని
అప్పుడే వేడిగా అమ్మే తినుబండారాలు
వేడిని పెంచాలని
ఇళ్ళు
పక్షులు
వెచ్చటి సూరీడితో
సెగ కాచుకోవాలని
ఎదురు చూస్తున్నాయి
ఇద్దరి ప్రేమికుల మధ్య తీరని అలకలా
మేఘం చాటున సూరీడు
అలా మెల్లిగా వస్తున్నాడు
