ఓ గణపయ్యా
ఓ గణపయ్యా
చిన్న కన్నులు సూక్ష్మానికి ప్రతిరూపం,
పెద్ద చెవులు ఎక్కువ గ్రహించమని అర్థం,
తొండం గట్టి సంకల్పానికి చిహ్నం,
పెద్ద బొజ్జ అన్నింటినీ జీర్ణం చేసుకోమని మర్మం,
పాశ, అంకుశాలు రాగ ద్వేష నియంత్రకాలు,
నాలుగు చేతులు చతుర్వేదాలకు సూచకం,
వక్రతుండం ఓంకారానికి సంకేతం,
లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం,
లడ్డు శుభానికి సూచకం,
నీ రూపం జ్ఞాన స్వరూపం,
నీ నామ స్మరణం విఘ్న వినాశనం !!
