ఓ భగవంతా
ఓ భగవంతా
యాడనున్నావో ఓ భగవంతా
యాడున్నావయ్యా సామి
ఈ మాయాలోకంలో
మంత్రాలు చదివిన కనిపించవాయే
శ్లోకాన్ని పఠించిన పలకవేమి
కోనేరులో మునిగిన కానరావేమి
కీర్తనలను పాడిన వినిపించలేదా
కుళ్ళిపోయిన లోకం కానరావట్లేదా
శిలని కదా అని రాయిలా ఉండిపోయావ
యాడనున్నావో ఓ భగవంతా
యాడున్నావయ్యా సామి
నా పూజలు నీకందలేదా సామి
ఇంకేల నీకు పూజ చేయాలి
నల్లరాయిలో దాగున్నావని నిన్నే
నే నిత్యం కొలుస్తుంటిని
నా మొర నీకు వినిపించలేదా
ఈ ఆశాపాశాల నడుమ నన్నేల నిలిపితివి
బ్రతుకు భ్రమల చక్రంలో ఇరికిస్తివి
యాడనున్నావో ఓ భగవంతా
యాడున్నావయ్యా సామి
