ఒంటరిగా
ఒంటరిగా
వచ్చేటప్పుడు ఒంటరి
పోయేటప్పుడు ఒంటరి
అయినా మనసుకి ఏదో అల్లరి
వయసు వచ్చిందనో
వయసులో ఉన్నామనో
వయసు అయిపోతోందనో
పెళ్లి అంటారు
పెళ్లి తోడు కోసం అంటారు
తోడు ఎందుకు అంటే
జీవితమంతా ఒంటరిగా ఉండలేవు కాబట్టి అంటారు
సరే సరే
ఆ తోడు శాశ్వతం అని వీళ్ళు చెప్పగలరా
లేదు కదా
ఇలా మాట్లాడితే వితండవాదం చేస్తున్నావు అంటారు
లోకంలో ఎవ్వరికీ తెలియనివి
నీకే తెలుసా అంటారు
ఇదేమీ శాస్త్రవేత్తలు చెప్పాల్సిన అవసరం లేదు
నీ చుట్టూ ఉన్న వాళ్ళు
నువ్వు చూస్తున్న వాళ్ళు
వాళ్ళ జీవితాలను బట్టి తెలుసుకోవచ్చు
సంసార సాగరాన్ని ఈదే మనిషి
తెలిసే అందులోకి దిగుతున్నాడా
లేదా
అందరూ అందులోనే ఉన్నారని వెళుతున్నాడా
నీకెంత తెలుసో
నాకంతే తెలుసు
నువ్వు చెప్పవు
నేను చెబుతున్నా
అంతే..