ఒక రైలు ప్రయాణం
ఒక రైలు ప్రయాణం
చీకటిలో వెతుకుతున్నారు
అందరినీ గమనిస్తున్నారు
ముసుగు కప్పుకున్న
నలుగురు గూండాలు
కూడబలుక్కుని ఏదో నిర్ణయించుకున్నారు
చీకటి మలుపుల గుహల్లాంటి దారుల్లో
రైలు బండి సాగిపోతోంది
ఉన్నట్టుండి లైట్లు వెలిగాయి
అమాయక ప్రయాణీకులు అదిరిపడ్డారు
డబ్బు, నగల కోసం కాదు ఈ వేట
వారికి కావాల్సిన మనిషి కోసం
కత్తులు బయటికి తీశారు
నెత్తురు కళ్ళజూస్తామన్నారు
ఇంతలో రైలు ఆగింది
బయట చూస్తే పోలీసుల ముట్టడి
గూండాలు దూకి పారిపోయేందుకు వీలు చిక్కని స్థితి
చైన్ లాగి రైలు ఆపింది ఎవరో
గూండాలు వెతికేది కూడా ఆ వ్యక్తి కోసమే
