ఒక కుక్క--ఒక నక్కఒక ముక్క!!
ఒక కుక్క--ఒక నక్కఒక ముక్క!!
మూడు సంవత్సరాలు నిష్ఠతో జపం చేసిన
ఒక కుక్కకు ఆకలి వేసింది
ముద్ద కోసం ముప్పు తిప్పలు పడుతుంటే
ఒక లేత రుచికరమైన మాంసం ముక్క దొరికింది తినకుండా కాళ్ళు చేతులు కడుక్కుని
పరిశుభ్రంగా తిందామని అనుకుంది
కానీ పాపం తెలివితక్కువ కుక్కకు
ఆలస్యం అమృతం విషం అని తెలియదుగా...
ఈలోపే ఒక నక్క
ఆ లేత మాంసం ముక్కని
పొదల్లోకి, గుట్టల్లోకి
పుట్టల్లోకి, పూలతోటల్లోకి
కాల్వగట్లకు లాక్కెళ్ళి
దానిపై దొర్లడం,
చేతులతో పిసకడం
గోళ్ళతో రక్కడం
కాళ్లతో తొక్కడం
నోటితో కొరకడం
బొక్కకు తన సొల్లు రాసి ఎంగిలి చేయడం
దాని చుట్టూ మాత్రం పోయడం
కుక్కకు దొరుకుతదేమోనని....
ఆ ముక్కను దాచుకొని దాచుకొని
మాంసం అంత పిక్కోని పిక్కోని
మూలిగనంత నంజుకుని నంజుకుని
రసం అంతా పిండేసి పీల్చేసి
బొక్క అంత చప్పరించి చప్పరించి
రోజుకు మూడు సార్లు.....
మూడు సంవత్సరాలు గతికి గతికి
ఓ పెళ్లి ఎంగిలి విస్తరిలో ఉమ్మేసింది
ఇది తెలియని కుక్క
మూతులు కడుక్కుంటూ
చేతులకు శానిటైజర్ చేసుకుంటూ
చాలా శ్రద్ధగా మంగళ స్నానాలు చేసి
పువ్వులు ఏరుకొని, పూజ చేసుకుని
హారతి పట్టి, దేవుడికి నైవేద్యం పెట్టి
ఆ గతికిన ముక్కను
జుర్రెసిన మురుసును
నోట్లో పెట్టుకుంది
కుక్కకు అప్పుడే తెలిసింది
అది రసం కాదు సొల్లు అని
అది మూలిగా కాదు బూజు అని
అసలు సిసలు అయినా
లేత మాంసం ముక్క కాదని
అది అస్థిపంజర ఎముకల గూడెనని
దానికి లేలేత మాంసం లేదని
వేడిగా ఉన్నప్పుడే ఒక నక్క.....
తన వాడిగా ఉన్న దంతాలతో
దంచి దంచి చీరేసీ ఆరేసి
కడుపార ఆరగించి, అనుభవించి
దాని సర్వము లాక్కొని
ధ్వంసం చేయబడిన దౌర్భాగ్యపు
దరిద్ర కోడి పీనుగ బొక్క అని
అది చిరిగిన రెండు విస్తరాకుల మధ్య
విసిరేసి ఉందంటేనే
దాని బతుకు, దాని విలువ
దాని తత్వం, దాని పైత్యం
దాని గబ్బు, దాని జబ్బు
దానికి కంపు, దాని రొంపు
ఆ కుక్కలకు అన్నింటికీ
ముందే తెలిసి ఉంటుదని
తను ఊహించాల్సి ఉండవలిసిందని
ఆ కుక్క తన మనసులో నాకు అదృష్టం
ఆఖరి చూపు లాంటిది అనుకొని ....
దీని కొరకేనా ...
పవిత్ర పుస్తకాల పారాయణం చేసింది
మూడు సంవత్సరాలుగా,
రోజుకు మూడు సార్లు మడి కట్టుకొని
హారతులు,పూజలు, నైవేద్యాలు పెట్టింది
దీని కొరకైనా సూర్యనమస్కారాలు
సంధ్యా వందనం లాంటి కఠిన ఆచారాలు పాటించింది
ఛి.... ఛి.... కుక్కలాగా బతక కూడదని
ఇలాంటి కుక్క బతుకు అసలే వద్దు అని
దాని ఆడకుక్క ఎంత బతిమిలాడినా
భంగపడ్డ తన మనసుని బొంద పెట్టి
పిచ్చి కుక్కలాగ మారి బతుకుతుంది
*****
సుదూరం నుండి సమీరం సినీ గీతాన్ని లీలగా మోసుకొచ్చింది
"మనసు గతి ఇంతే -మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే
మనసు గతి ఇంతే"
