ఒడిపొవలి
ఒడిపొవలి

1 min

236
చిరిగిన చొక్కాలు
యుద్దాలు మరిపించే అరుపులు
మొకాలి గాయలు
రక్తపు మరకలు
మా కబ్బడి గురుతులు
అరువు బజ్జిలు
అర్ద గ్లాసు సొడాలు
చల్లారి పొయినా అన్నాలు
బడిలొ ఆకలి మరుపులు
ఫొనుకి లేని రూపాయలు
సైకెలులొ చేసింగ్లు
పంచుకు తిరిగె అత్తరులు
యొవనములొ మా ప్రేమలు
దెబ్బలు తిన్న
అకలితొ పడుకున్న
ఎప్పుడు మరవనిది
పెదవి పై చిరునవ్వు
పక్కన జబ్బ చరిచేవారు లేక
కొట్లు చిల్లరగ మిగిలింది
కారు వ్యంగ్యంగా నవ్వింది
హొటల్ ప్లేటు జాలిగ చూసింది
నా స్నెహితుడు లేడని
ఓ ప్రపంచమ
ఈ పరుగులు కొంచెం ఆపు
ఒక సారి నా స్నెహితుడు చేతిలొ ఒడిపొయి
మల్లి ఈ పరుగులు జీవితని గెలుస్తా