STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నవ్వడం మరచిపోయా...

నవ్వడం మరచిపోయా...

1 min
5

అంత బాధలో కూడా

భాషను మరువలేదు

తెలుగులోనే ఏడ్చా

అదేంటి తెలుగులో ఏడవడం

ఏడుపు ఏ భాషలో అయినా ఒకటే కదా

ఏమో కాదేమో


ప్రతి దానికీ ఆందోళన

ఎవరిని చూసినా భయం

మాట్లాడితే భయమెందుకు

మాట్లాడితే నచ్చే అవకాశం ఉంది

నచ్చితే నమ్మడం అలవాటు అవుతుంది

నమ్మితే మళ్ళీ మోసపోవాలి

నవ్వడం మరచిపోవాలి


ఇంత డ్రామా ఎందుకు

ఈ మనుషుల నుంచి దూరంగా వెళ్లి..

ఎక్కడికి వెళ్తాం

మనుషుల్ని వదిలేసినా ఫోన్ వదలం కదా

ఫోన్లో అందరూ ఉన్నారు


గతాన్ని గుర్తు చేసే వాళ్ళు

భవిష్యత్తును భయపెట్టే వాళ్ళు

వర్తమానాన్ని తినేసే వాళ్ళు

మరెలా..


Rate this content
Log in

Similar telugu poem from Abstract