నువ్వూ - నేనూ - ఓ వింత
నువ్వూ - నేనూ - ఓ వింత
మాట్లాడుకుందాం అంటే
టెలీపతి ఉంది కదా అంటావ్
సముద్రం నుంచి ఆకాశాన్ని అందుకుందాం అంటావ్
ప్రేమలో అన్నీ సాధ్యమే
బాగుంది
కానీ నిన్ను అర్థం చేసుకోవడం దుస్సాధ్యమే
పున్నమి చంద్రుడు బాగున్నాడు అంటే
కృష్ణ పక్షంలో చంద్రుడు ఇష్టం అంటావ్
ఇసుక రేణువులు లెక్కపెడుతూ కూర్చుంటావ్
నన్ను నేను మరచేంతలా
చెంత చేరిన నిన్ను ప్రేమించాలి అంటావ్
అంతలోనే వేరే లోకానికి వెళ్ళాలి అన్నట్టు కనిపించకుండా వెళ్ళిపోయావ్
నీతో బంధం ఎలా ఉంటుంది తెలుసా
డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొత్త రోగం తెచ్చుకున్నట్టు
గోడకు వేసిన సున్నం గోళ్ళతో గోకినట్లు ఉంటుంది
ఇక నా వల్ల కాదు
ఈ సూక్తి ముక్తావళి నేను వినలేను
ఏ రియాలిటీ షోకో వెళ్ళిపోతాను
ఇక నిజా నిజాలు రోజూ మార్చుకుంటూ
నీ ఆలోచనల నుండి బయటపడతాను
మనసు మార్చుకుంటే
వస్తానంటే చెప్పు
ఇద్దరం కలిసే వెళదాం..

