STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Drama

4  

Dinakar Reddy

Abstract Children Stories Drama

నిమ్మొప్పులు

నిమ్మొప్పులు

1 min
2.5K

ఎక్కడో రేణిగాయ వడలు చూశాను

రాజుగాడు జ్ఞప్తికి వచ్చాడు

చింతపండు రోట్లో దంచుకునేందుకు పోటీ పడడం

దీపావళికి పాము పుస్సలు కాల్చి

మెటికలన్నీ నల్లగ చేయడం


నల్లికాయల కోసమే స్నేహితుని ఇంటికి వెళ్ళడం

క్లాసులో నిమ్మొప్పులు సప్పరిస్తూ దవడ పక్కన పెట్టి పోజు కొట్టడం

టెంకాయ చెట్టు ఆకుల్ని తెంపి ఎగరేస్తూ

కరెంట్ పోయినప్పుడు నేలా బండా ఆడుతూ

ఏందో ఆ రోజులు


స్నేహమంటే ఏంది 

సావాసగాళ్ళు అంటే ఏంది

గుడిలో రెండో సారి దొంగగా ప్రసాదం తెచ్చుకునేప్పుడు

ట్యూషన్ పోకుండా యెగ్గొట్టినప్పుడు

అన్నింట్లో తోడే వాళ్ళు


ఆ చిన్న నాటి స్నేహాలు

ఏడనో మబ్బులో పడిపోయిన వస్తువు మాదిరి అయినాయి

ఉండాయి కానీ దొరకడంలా


ఈపుద్దు బతుకంటేనే బిజీ

బిజీగా ఉంటేనే ఇలువ

ఈ ఉద్యోగాలు ఖర్చుల్లో పడి

వాట్సాప్ స్టేటస్ చూస్తాం కానీ

ఒక్కతూరి చిన్నప్పటి స్నేహితులకు ఫోన్ చేస్తామా


కార్లో తిరిగుతూ

కాబట్టీ కాబట్టనోళ్లు సుట్టూ ఉన్నా

నిన్ను నువ్వెంత గొప్పోనివి అనుకున్నా

ఏందిరా సామీ యెట్టుండావ్

అని సావాసగాడు పిలిచే పిలుపుకు దూరం గాకబ్బా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract